అక్షరటుడే, ఇందూరు: వర్షం నుంచి వడ్లు, మక్కలను కాపాడుకోడానికి రైస్ మిల్లర్లతో పాటు రైతులు మార్కెట్ యార్డ్ షెడ్లలో నిల్వ ఉంచుతారు. తెలంగాణలోనే అతిపెద్ద మార్కెట్ యార్డ్ అయిన నిజామాబాద్‌లో షెడ్ల నిర్వహణ గాలికొదిలేశారు. చినుకు పడితే చాలు నీటి దారతో ధాన్యం తడిసిపోతోంది. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి నీరు లోపలికి రావడంతో ధాన్యం, మక్కలు తడిసిపోయాయి. షెడ్డు మరమ్మతులు చేయించి నీరు లోపలికి రాకుండా చూడాలని మిల్లర్లు, రైతులు కోరుతున్నారు.