అక్షరటుడే, వెబ్ డెస్క్: నగరంలోని వినాయకనగర్ ఉపకేంద్రం పరిధిలో మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏడీఈ చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు న్యాల్కల్ చౌరస్తా సూర్యనగర్, చంద్రనగర్ కోటగల్లి, హనుమాన్ నగర్, పద్మానగర్, యాదగిరిబాగ్, వినాయకుల బావి, విజయలక్ష్మిగార్డెన్, వినాయకనగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.