అక్షరటుడే, వెబ్డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా–ఇంగ్లండ్ మ్యాచ్లో వింత ఘటన చోటు చేసుకుంది. వాస్తవానికి ఏదైనా మ్యాచ్ ప్రారంభమైతే ఇరుజట్లకు సంబంధించిన జాతీయ గీతాలను ప్లే చేస్తారు. కాని ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగితే పొరపాటుగా భారత్ జాతీయగీతం ‘జనగనమణ’ను ప్లే చేశారు. దీంతో స్టేడియంలోని అభిమానులు అవాక్కయ్యారు.