అక్షరటుడే, వెబ్‌డెస్క్ : పండుగ సీజన్‌లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ లావాదేవీలు (UPI) సంఖ్యాపరంగా, విలువపరంగా పెరిగాయి. అక్టోబర్‌లో ఈట్రాన్సక్షన్ల సంఖ్య 1,658 కోట్లకు చేరినట్లు, ఈలావాదేవీల విలువ రూ.23.5 లక్షల కోట్లకు చేరిందని ఎన్‌పీసీఐ తెలిపింది. గతంలో లేనంతగా యూపీఐ లావాదేవీలే వృద్ధి చెందినట్లు పేర్కొంది. వార్షిక ప్రాతిపదికన యూపీఐ లావాదేవీల్లో సంఖ్యాపరంగా 45 శాతం వృద్ధి చెందగా.. విలువ పరంగా 34 శాతం పెరిగాయని పేర్కొన్నారు. గతేడాది యూపీఐ సేవలు అందిస్తున్న బ్యాంకుల సంఖ్య 492 కాగా.., ఈఏడాది ఆసంఖ్య 622కు పెరిగింది.