అక్షరటుడే, ఇందూరు: హిందూ రాష్ట్రస్థాపనే ధ్యేయంగా ముందుకెళ్లాలని, సమాజమంతా సంఘటితం కావాలని హిందూ వాహిని అఖిలభారత సహ సంఘటన మంత్రి దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురువారం నగరంలో దసరా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ 99 ఏళ్లు పూర్తి చేసుకొని 2025 నాటికి వందేళ్లలోకి అడుగు పెడుతుందన్నారు. ఇన్ని ఏళ్లలో రామసేతు, అయోధ్య రామాలయంతో పాటు పలు సమస్యలపై పోరాడిందన్నారు. హిందువులు తమ కుటుంబం పై ఎంత శ్రద్ధ చూపుతారో సమాజంలో జరుగుతున్న ఘటనలపై కూడా అంతే స్పందించాలన్నారు. అంతకుముందు కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరించారు. జిల్లా సంఘ్ చాలక్ డాక్టర్ గురుచరణ్, నగర కార్యవాహ అర్గుల సత్యం తదితరులు పాల్గొన్నారు.