drug case | డ్రగ్స్ కేసులో ‘దసరా’ విలన్​.. హోటల్​ నుంచి పరారీ!

drug case | డ్రగ్స్ కేసులో దసరా విలన్​..హోటల్​ నుంచి పరారీ!
drug case | డ్రగ్స్ కేసులో దసరా విలన్​..హోటల్​ నుంచి పరారీ!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: drug case : విలనిజంకు కేరాఫ్​ గా నిలిచిన మలయాళ నటుడు(Malayalam actor )షైన్ టామ్ చాకో(Shine Tom Chacko) నిజ జీవితంలోనూ విలన్​గా మారాడు. షైన్ టామ్ చాకోపై పోలీసులకు ఇటీవల ఓ మలయాళ నటి(Malayalam actress) ఫిర్యాదు చేసింది. ఆయన తనతో అనుచితంగా ప్రవర్తించాడని సదరు నటి ఆరోపణ. ఈ మేరకు ఆమె కేసు కూడా పెట్టింది.

Advertisement

ఇప్పుడు ఇక ఈ నటుడిపై ఏకంగా డ్రగ్స్ కేసు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఓ హోటల్‌లో డ్రగ్స్ దందా నడుస్తుందని తెలియడంతో పోలీసులు రైడ్ చేశారు. విషయం తెలుసుకున్న షైన్ టామ్ చాకో అక్కడి నుంచి పారిపోయినట్లుగా సమాచారం.

హోటల్​ నుంచి షైన్ టామ్ చాకో పారిపోతున్న సీసీటీవీ ఫుటేజీ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, ఈ డ్రగ్స్ కేసులో ఆయనకు ఎలాంటి సంబంధం ఉందనే విషయం ఇంకా బయటకి రాలేదు. ఇక తెలుగు ప్రేక్షకులకు ‘దసరా’ చిత్రంలో షైన్ టామ్ చాకో విలన్ పాత్రలో నటించాడు.

Advertisement