అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: బాలలపై లైంగిక వేధింపులు, బాల్య వివాహాల నియంత్రణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డీడబ్ల్యూవో ఎస్కే రసూల్బీ, డీసీపీ బాసిల్రెడ్డి అన్నారు. స్థానిక బాలరక్ష భవన్లో మంగళవారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్పర్సన్ సంపూర్ణ, సభ్యులు శోభారాణి, రాజేంద్రప్రసాద్, ఆర్ఎంవో, బాల రక్షభవన్ కో-ఆర్డినేటర్ విజయలక్ష్మి, డీసీపీఓ చైతన్య, సఖి కోఆర్డినేటర్ భాను, సిబ్బంది పాల్గొన్నారు.