అక్షరటుడే, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. ఈ దేశ మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌, హమాస్ మిలటరీ కమాండర్‌ మొహ్మద్ డేఫ్‌కు సైతం వారెంట్లు జారీ కావడం గమనార్హం. కాగా గాజాలో జరిగిన వైమానిక దాడులలో డేఫ్‌ చనిపోయారని ఇజ్రాయెల్ సైన్యం జులైలో ప్రకటించింది. యుద్ధ నేరాలు, మానవాళికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు న్యాయమూర్తులు చెప్పారు. కాగా.. ఈ ఆరోపణలను రెండు దేశాలు తిరస్కరించాయి.