Earth Hour Day : నేడు ఎర్త్ అవ‌ర్ డే.. గంట పాటు మొత్తం చీక‌టి కానుందా?

Earth Hour Day : నేడు ఎర్త్ అవ‌ర్ డే.. గంట పాటు మొత్తం చీక‌టి కానుందా?
Earth Hour Day : నేడు ఎర్త్ అవ‌ర్ డే.. గంట పాటు మొత్తం చీక‌టి కానుందా?

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Earth Hour Day : వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థ సంవత్సరానికి ఒకసారి నిర్వహించే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మ‌మే Earth Hour ఎర్త్ అవర్ . ఎర్త్ అవర్ సమయంలో.. వ్యక్తులు, కమ్యూనిటీలు, వ్యాపారులంతా.. భూమి( Earth) పట్ల నిబద్ధతకు చిహ్నంగా.. లైట్లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఒక గంట పాటు ఆఫ్ చేయాల‌ని చెబుతుంటారు. రాత్రి ఎనిమిదిన్నర నుంచి ఒక గంటసేపు లైట్లు ఆర్పమని పలు స్వచ్ఛంద సంస్థలు పిలుపునిస్తూ ఉంటాయి. భూ మండలాన్ని భవిష్యత్తు తరాలకు సురక్షితంగా అందించాలనే ఉద్దేశంతోనే ప్ర‌తి ఏడాది ఈ ఎర్త్ అవ‌ర్ జ‌రుపుకుంటూ ఉంటాము.

Advertisement
Advertisement

Earth Hour Day : గంట పాటు చీక‌టి మ‌యం..

అయితే గంట పాటు లైట్లను ఆర్పేస్తే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందనేది నిపుణుల అభిప్రాయం. 2007లో ఆస్ట్రేలియాలోని (Australia) సిడ్నీలో సింబాలిక్ లైట్స్ అవుట్ కార్యక్రమంగా ఇది ప్రారంభం కాగా, అప్పటి నుంచి 190కి పైగా దేశాల్లో ఈ కార్యక్రమాన్ని పాటిస్తూ ఇది ఒక‌ ప్రపంచ ఉద్యమంగా మారింది. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల‌లో కూడా ఈ కార్యక్రమాన్ని పాటిస్తారు. అయితే.. ఈ Earth Hour ఎర్త్ అవర్ సందర్భంగా నగరంలోని ఐకానిక్ కట్టడాలన్ని చీకటిగా మారిపోతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఎర్త్ అవర్ డే రోజు హైద‌రాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ రాష్ట్ర సచివాలయం, దుర్గం చెరువు కేబుల్ వంతెన, హుస్సేన్ సాగర్‌లోని బుద్ధ విగ్రహం, గోల్కొండ కోట, తెలంగాణ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, చార్మినార్.. లాంటి నగరంలోని ప్రముఖ కట్టడాలన్ని కూడా చీక‌టిగా మారిపోతుంటాయి.

గంట పాటు ఇండ్లతో పాటు ఈ క‌ట్ట‌డాల‌లో కూడా లైట్స్ ఆపేసి ఎర్త్ అవ‌ర్‌లో పాల్గొంటూ ఉంటారు. గ‌త కొద్ది సంవ‌త్స‌రాలుగా చాలా మంది ప్ర‌జ‌లు దీనికి మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈరోజు Earth Hour ఎర్త్ అవర్ పాటించనున్నారు. ఢిల్లీలోనూ.. చాలా మంది ప్రజలు ఈ ఎర్త్ అవర్‌ కార్యక్రమంలో పాల్గొని.. తమ బాధ్యతను నెరవేర్చనున్నారు .ఇండియాతో పాటు లాస్ ఎంజిల్స్, హాంకాంగ్, సిడ్నీ, రోమ్, మనీలా, సింగపూర్, దుబాయ్‌లో కూడా ఈ ఎర్త్ అవర్ (Earth hour) పాటిస్తుంటారు.

Advertisement