Earthquake | ఇటలీలో భూకంపం..40 ఏళ్లలో ఇదే అత్యంత తీవ్రమైనది

Earthquake | ఇటలీలో భూకంపం..40 ఏళ్లలో ఇదే అత్యంత తీవ్రమైనది
Earthquake | ఇటలీలో భూకంపం..40 ఏళ్లలో ఇదే అత్యంత తీవ్రమైనది
Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Earthquake : ఇటలీలోని నేపుల్స్, పరిసర ప్రాంతాలలో గురువారం 4.4 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. నాలుగు దశాబ్దాలలో నగరాన్ని తాకిన అత్యంత బలమైన భూకంపం ఇదే కావడం గమనార్హం. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 01.25 గంటలకు సంభవించిన ఈ భూకంపంతో భయాందోళనకు గురైన ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. చాలామంది తమ కార్లలో రాత్రంతా గడిపారు.

Earthquake : రెండు రకాల నివేదికలు..

Earthquake | ఇటలీలో భూకంపం..40 ఏళ్లలో ఇదే అత్యంత తీవ్రమైనది
Earthquake | ఇటలీలో భూకంపం..40 ఏళ్లలో ఇదే అత్యంత తీవ్రమైనది

ఇటాలియన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ అండ్ వోల్కనాలజీ (Italian National Institute of Geophysics and Volcanology – INGV) ప్రకారం, భూకంపం సంభవించిన కాంపి ఫ్లెగ్రే ప్రాంతంలో ఉన్న పోజువోలి పట్టణానికి సమీపంలో మూడు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (United States Geological Survey – USGS) ప్రకారం.. పది కిలోమీటర్ల లోతులో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నమోదైంది.

Earthquake : భయాందోళనకు గురైన ప్రజలు

భూకంపం ఏర్పడిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో కాంపానియా ప్రాంతం అంతటా ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. కొన్ని ప్రాంతాలలో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల భవనాలు శిథిలమయ్యాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  Earthquake | ఫిలిప్పీన్ దీవుల్లో భూకంపం
Earthquake | ఇటలీలో భూకంపం..40 ఏళ్లలో ఇదే అత్యంత తీవ్రమైనది
Earthquake | ఇటలీలో భూకంపం..40 ఏళ్లలో ఇదే అత్యంత తీవ్రమైనది

Earthquake : ప్రజలు ఆందోళన చెందొద్దు

భూకంపం తర్వాత కూడా రెండు చిన్న ప్రకంపనలు ఏర్పడ్డాయి. ఇది భూకంప కార్యకలాపాల భయాలను మరింత పెంచింది. స్థానిక అధికారులు గురువారం పోజువోలి, బాగ్నోలి, బాకోలి(Pozzuoli, Bagnoli, Bacoli) లోని పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని బాకోలి మేయర్ జోసి గెరార్డో డెల్లా రాగియోన్ సూచించారు.

Earthquake : నేపుల్స్.. అగ్నిపర్వత ప్రాంతం

భూకంప కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిన విస్తారమైన అగ్నిపర్వత కాల్డెరా(volcanic caldera) అయిన కాంపి ఫ్లెగ్రే(Campi Flegrei) పైన నేపుల్స్(Naples) ఉంది. 20 సంవత్సరాల క్రితం ప్రాంతీయ ఉద్యానవనంగా ప్రకటించబడిన ఈ ప్రాంతంలో 15 పట్టణాలు ఉన్నాయి. వీటిలో 5 లక్షలకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో చాలామంది అధిక-ప్రమాదకర ‘రెడ్ జోన్’లో నివసిస్తున్నారు.

Earthquake | ఇటలీలో భూకంపం..40 ఏళ్లలో ఇదే అత్యంత తీవ్రమైనది
Earthquake | ఇటలీలో భూకంపం..40 ఏళ్లలో ఇదే అత్యంత తీవ్రమైనది

Earthquake : 1538లో చివరి సారిగా..

కాంపి ఫ్లెగ్రే(Campi Flegrei volcano) అగ్నిపర్వతం చివరిసారిగా 1538లో విస్ఫోటనం చెందింది. కానీ ఇటీవలి దశాబ్దాలలో భూకంప ప్రమాదాలు పెరుగుతున్నాయి. భూకంపాలలో ఇటీవలి పెరుగుదల బ్రాడీసిజంతో ముడిపడి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూగర్భ శిలాద్రవం(magma) గదులు(chambers) భూమి కదలికకు కారణమవుతున్నాయి.

Advertisement