అక్షరటుడే, వెబ్‌డెస్క్: Earthquake | పపువా న్యూగినియాలో Papua New Guinea మళ్లీ భూకంపం సంభవించింది. ఈసారి దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదైంది. భారత కాలమాన Indian time ప్రకారం ఉదయం 9:17 గంటలకు భూకంపం వచ్చింది. కొకొపో, ఈస్ట్ న్యూ బ్రిటైన్ కు Kokopo, East New Britain 115 కిలోమీటర్ల దూరంలో, 72 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని ప్రభావం వివరాలు ఇంకా తెలియరాలేదు.
భూకంపాలకు నెలవుగా ఉన్న పపువా న్యూగినియాలో Papua New Guinea గత 24 గంటల్లో రెండు సార్లు భూకంపం Earthquake వచ్చింది. వారం రోజుల్లో 42, నెల రోజుల్లో 78 సార్లు భూమి కంపించింది. గత ఏడాది కాలంలో ఈ దేశంలో 383 సార్లు భూకంపం ఏర్పడింది.