Advertisement
అక్షరటుడే, న్యూఢిల్లీ: Earthquake : లడఖ్‌లోని కార్గిల్‌లో శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
తెల్లవారుజామున 2:50 గంటలకు ఈ ప్రకృతి విపత్తు ఏర్పడింది. 15 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు ఏర్పడ్డాయి. నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement