అక్షరటుడే, బాన్సువాడ:Congress Banswada | రాజకీయ కక్షతోనే సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ కేసులు నమోదు చేసిందని రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు(Kasula Balaraju) అన్నారు. గురువారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా(Ambedkar chowrastha)లో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ (National herald) విషయంలో గాంధీ కుటుంబంపై తప్పుడు కేసులు నమోదుచేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే కేసులను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నార్ల సురేష్, ఎజాజ్, కాలేక్, గోపాల్ రెడ్డి, గురు వినయ్, గంగుల గంగారం, నార్ల నందకిషోర్, కిరణ్, వాహబ్ తదితరులు పాల్గొన్నారు.