అక్షరటుడే, వెబ్డెస్క్: National Herald case | నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి Sonia Gandhi and Rahul Gandhi ఈడీ ED షాకిచ్చింది. నేషనల్ హెరాల్డ్ అసోసియేషన్ జర్నల్ లిమిటెడ్ ఆస్తుల స్వాధీనం చేసుకునేందుకు ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు సంబంధిత శాఖలకు నోటీసులు జారీ చేసింది.
రూ.700 కోట్లకు పైగా ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు ప్రారంభించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం వెల్లడించింది. ఢిల్లీ, ముంబయి, లక్నోలోని ప్రాపర్టీ రిజిస్ట్రార్స్‌కు ఈడీ నోటీసులు అందించింది.
ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్ Herald House Delhi, ముంబైలోని బాంద్రాలో Mumbai Bandra గల ఓ ఆస్తిని, లక్నోలోని ఏజేఎల్ భవనాన్ని ఖాళీ చేయాలని నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)లోని సెక్షన్ (8),రూల్ 5(1) కింద ఈ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపినట్లు సమాచారం. కాగా.. నేషనల్ హెరాల్డ్ అంశంపై బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి కేసు వేసిన విషయం తెలిసిందే.