అక్షరటుడే, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి గురువారం ఈడీ నోటీసులు జారీ చేసింది. పీజీ మెడికల్ సీట్లలో అక్రమాలు జరిగినట్లు సమాచారం ఉండడంతో నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది జూన్‌లో మాజీ మంత్రి ఇంట్లో సోదాలు జరిపిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో ఆయనకు చెందిన 12 మెడికల్ కళాశాలల్లో కీలక దస్త్రాలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకుంది. రాష్ట్రంలో మొత్తం 10 ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో పలు మెడికల్ సీట్లు బ్లాక్ చేసినట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం.