Advertisement

అక్షరటుడే, బాన్సువాడ: ఆడపిల్లలకు చదువు తప్పనిసరి అని, వారికి తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి అదేనని వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలలో మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్‌ ఛైర్మన్‌ కాసుల బాలరాజ్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ జంగం గంగాధర్‌, జిల్లా మహిళా సంక్షేమ అధికారిణి ప్రమీల, బాలికల సంరక్షణ కమిటీ సభ్యురాలు స్వర్ణలత పాల్గొన్నారు.

Advertisement