అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: Gadikota trust | ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని దోమకొండ గడీకోట ట్రస్ట్ మేనేజర్ బాబ్జి అన్నారు. శుక్రవారం స్థానిక ఆనంద్ భవన్‌లో దోమకొండ ఫోర్ట్ డెవలప్మెంట్ ట్రస్ట్(domakonda fort development trust) ఆధ్వర్యంలో గ్రామంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, మాజీ ప్రజా ప్రతినిధులు మాట్లాడారు.
2024–25లో సంస్థ చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు, యువతకు నైపుణ్య కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. సమావేశంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంఈవో విజయ్‌కుమార్, జీపీ ఈవో యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.