అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ నగరంలోని ఓ పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి జరిపారు. నాలుగో టౌన్ పరిధిలోని వినాయక్ నగర్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో తనిఖీలు చేశారు. ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని రూ.56 వేల నగదు సీజ్ చేశారు. అనంతరం నాలుగో టౌన్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు. అయితే పట్టుబడిన వారిలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. వారిరువురు పేకాట ఆర్గనైజింగ్ చేస్తున్నట్లు సమాచారం. గతంలోనూ అనేకమార్లు పేకాట కేసులో వీరు పట్టుబడ్డారు. తాజా కేసులో అయినా పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది. తనిఖీల్లో సీఐ అంజయ్య, సిబ్బంది లక్ష్మన్న, సుదర్శన్, అనిల్, నర్సయ్య, అజాం పాల్గొన్నారు.