అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్‌లకు బదిలీ జరిగింది. ఈమేరకు చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వికాస్‌రాజ్‌ను రవాణా, ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. అలాగే వాణిజ్య పనుల శాఖ కమిషనర్‌గా ఉన్న శ్రీదేవిని ఎస్సీ డెవలప్‌మెంట్ కమిషనర్‌గా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. విపత్తుల నిర్వహణ సంయుక్త కార్యదర్శి హరీశ్‌కు అడిషనల్ చార్జ్ ఇచ్చారు. ఉదయ్ కుమార్ మార్కెంటింగ్ శాఖ డైరెక్టర్‌గా, ప్రియాంకకు పురపాలక శాఖ ఉపకార్యదర్శిగా, చంద్రశేఖర్ రెడ్డిని హెచ్‌ఏసీఏ ఎండీ, శ్రీనివాస్ మార్క్‌ఫెడ్ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.