అక్షరటుడే, వెబ్ డెస్క్: ప్రపంచ క్రీడా సంబరమైన పారిస్ ఒలింపిక్స్ లో తెలుగు క్రీడాకారులు తమ సత్తా చాటనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఎనిమిది మంది క్రీడాకారులు ఆయా క్రీడల్లో పోటీ పడనున్నారు. ఈ మెగా ఈవెంట్ లో పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్ (బ్యాడ్మింటన్), బొమ్మ దేవర ధీరజ్ (అర్చరీ), జ్యోతి యర్రాజి, జ్యోతి శ్రీ (అథ్లెటిక్స్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), ఆకుల శ్రీజ(టేబుల్ టెన్నిస్), ఇషా సింగ్ (షూటింగ్) ఉన్నారు. అయిదుగురు మహిళా క్రీడాకారిణిలు ఉండడం విశేషం.