9న ఏక చక్రేశ్వరాలయ వార్షికోత్సవం

0

అక్షరటుడే, బోధన్‌: పట్టణంలోని ప్రాచీన శైవక్షేత్రమైన ఏక చక్రేశ్వరాలయ వార్షికోత్సవాన్ని ఈ నెల 9న(శుక్రవారం) నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్‌ బీర్కూర్‌ శంకర్‌, ధర్మకర్త మండలి సభ్యులు తెలిపారు. వార్షికోత్సవం రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నామన్నారు. అలాగే అన్నదాన కార్యక్రమం ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.