అక్షరటుడే, ఇందూరు: నగరంలోని సుభాష్‌నగర్‌ విద్యుత్‌ ఉపకేంద్రంలో శనివారం మరమ్మతులు నిర్వహించారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండానే మొదటిసారిగా నెలవారీ మెయింటెనెన్స్‌ చేసినట్లు ఏడీఈ తోట రాజశేఖర్‌ తెలిపారు. టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి వినూత్న ఆలోచనతో ఇది కార్యరూపం దాల్చిందని.. ఇలాంటి విధానాన్ని జిల్లాలో మొదటిసారిగా అమలు చేశామన్నారు. జిల్లా నోడల్‌ అధికారి అశోక్‌, ఎస్‌ఈ రవీందర్‌, డీఈఎం శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఏఈ గంగాశేఖర్‌, ఇన్‌స్పెక్టర్‌ రాంగోపాల్‌, లైన్‌మెన్లు సంజీవ్‌, రమేష్‌, దశరథ్‌, ప్రేమ్‌లాల్‌, అసిస్టెంట్‌ లైన్‌మెన్లు కృష్ణయ్య, పరమేష్‌, సుధాకర్‌ పాల్గొన్నారు.