అక్షరటుడే, వెబ్‌డెస్క్: E bike taxis : మహారాష్ట్రలో ఎలక్ట్రిక్ బైక్ టాక్సీలు electric bike taxi రాబోతున్నాయి. ఈ మేరకు మహారాష్ట్ర రవాణా శాఖ(Maharashtra Transport Department) ప్రతిపాదనను పంపగా.. కేబినెట్ ఆమోదించింది. కంపెనీలు కనీసం 50 బైక్‌లను కలిగి ఉండాలని, ఒక బైకు కనీసం 15 కి.మీ వరకు ప్రయాణించగలగాలని నిర్దేశించింది.
కేబినేట్ తాజా నిర్ణయంతో మహారాష్ట్రలో 20,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. కేవలం ముంబైలోనే 10,000 ఉద్యోగావకాశాలు ఏర్పడబోతున్నాయి. మహిళల భద్రత, ఛార్జీల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రవాణా మంత్రి ప్రతాప్ సర్ణాయిక్(Transport Minister Pratap Sarnaik) వెల్లడించారు.
గతంలో, మహారాష్ట్రలో రాపిడో వంటి సంస్థలకు అనుమతి ఇవ్వడానికి చట్టపరమైన కొన్ని అవరోధాలు ఎదురయ్యాయి. 2022లో పూణే Pune RTO రాపిడోను తిరస్కరించింది. 2023లో బాంబే హైకోర్టు(Bombay High Court) కూడా దీనిని అనుమతించలేదు. కాగా, తాజా పాలసీతో ఈ-బైక్ టాక్సీలకు అనుమతి లభించింది.
E bike taxis : ఈ-బైక్ ప్రయోజనాలు..
తక్కువ ఖర్చుతో త్వరగా ప్రయాణించే వీలు కలుగుతుంది. ట్రాఫిక్ రద్దీ(Traffic congestion) తగ్గనుంది. విద్యుత్తు ఆధారంగా పనిచేసే వీటి వల్ల వాయు, శబ్ద కాలుష్యం(air, noise pollution) తగ్గుతుంది. చిన్న దూర ప్రయాణాలకు వేగంగా చేరుకునే అవకాశం కలుగుతుంది. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు(large-scale employment opportunities) కలుగుతాయి.