Electric Bus | తరచూ మొరాయిస్తున్న విద్యుత్​ బస్సులు

Electric Bus | తరచూ మొరాయిస్తున్న విద్యుత్​ బస్సులు
Electric Bus | తరచూ మొరాయిస్తున్న విద్యుత్​ బస్సులు
Advertisement

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Electric Bus | ఆర్టీసీ (RTC) ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు కాలుష్య నియంత్రణ కోసం విద్యుత్​ బస్సులు(Electric Buses) కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ఆయా డిపోలకు ఆ సంస్థ ఉన్నతాధికారులు ఎలక్ట్రిక్​ బస్సులు కేటాయించారు.

కాగా.. నిజామాబాద్​ డిపోకు కూడా జేబీఎం ఎలక్ట్రిక్​ బస్సులు వచ్చాయి. ఈ బస్సులను ఆయా రూట్​లలో నడుపుతున్నారు. అయితే ఎలక్ట్రిక్​ బస్సులు తరుచూ మొరాయిస్తుండటంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం వర్ని బస్టాండ్​ వద్ద నిజామాబాద్​ డిపో–2 కు చెందిన విద్యుత్​ బస్సు ఆగిపోయింది. బస్సు ఎంతకు స్టార్ట్​ కాకపోవడంతో మరో బస్సులో ప్రయాణికులను తరలించారు.

ఇటీవల ఆర్మూర్​లో కూడా ఎలక్ట్రిక్​ బస్సు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనూ ప్రయాణికులను మధ్యలో దింపివేశారు. ఇలా తరచూ ఎలక్ట్రిక్ బస్సులు మొరాయిస్తుండడంపై ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement