అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ వెంకట స్వామి శుక్రవారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఎల్లారెడ్డి టౌన్, పెద్దరెడ్డి, మత్తమల్ పరిధిలోని 33/11 కేవీ గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.