Advertisement
అక్షరటుడే, హైదరాబాద్: గచ్చిబౌలిలో విద్యుత్ శాఖ ఏడీఈ సతీశ్‌రెడ్డి శుక్రవారం రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. కాగా.. ఆయన నివాసంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో 22 ఎకరాల వ్యవసాయ భూమి, విల్లా, భవనాలు, ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనాకు వచ్చారు.
Advertisement