అక్షరటుడే, ఎల్లారెడ్డి: lingampet | కరెంట్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ వినియోగదారుల ఫోరం ఛైర్మన్ ఎరుకల నారాయణ అన్నారు. లింగంపేటలో గురువారం విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. కరెంట్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు తమ సమస్యలను వివరించారు. కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర కమిటీ సభ్యులు కిషన్, రాజా గౌడ్, ఎస్ఈ శ్రవణ్ కుమార్, డీఈ విజయ సారథి, ఏడీ మల్లేశం, ఏఈలు సాయినాథ్, హరీశ్‌రావు, లక్ష్మయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.