అక్షరటుడే, ఇందూరు: మలేషియాలో జరుగుతున్న ఓపెన్ మాస్టర్ అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ లో జిల్లాకు చెందిన విద్యుత్ ఉద్యోగులు పలు విభాగాల్లో పతకాలు సాధించారు. వాగ్మారే దినేశ్ 35ఏళ్ల వయసు పైబడిన విభాగం లాంగ్ జంప్ లో బంగారు, ట్రిపుల్ జంప్ లో రజత పతకం సాధించారు. ఆశలి గోపి 110 మీటర్ల హార్డీల్స్, లాంగ్ జంప్ లో రజతాలు, ట్రిపుల్ జంప్ లో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. అలాగే 4×400 రిలే రన్నింగ్ లో భారత జట్టు రజతం పొందింది. ఇందులో ఇద్దరు జిల్లా విద్యుత్ ఉద్యోగులు ప్రాతినిధ్యం వహించారు.