అక్షరటుడే, కామారెడ్డి : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. శనివారం సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామంలో వరిదాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. కుప్రియాల్ వద్ద అత్యవసరంగా గోదాం అవసరం ఉందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సీసీఎల్ లో మాట్లాడి స్థలం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ సదాశివరెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ సంగ్యా నాయక్, కాంగ్రెస్ నేతలు సంగారెడ్డి, ఇర్షాదుద్దీన్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ రాజిరెడ్డి, సొసైటీ డైరెక్టర్లు భాస్కర్, రాములు, కృష్ణారెడ్డి, లక్ష్మా గౌడ్ పాల్గొన్నారు.