అక్షరటుడే, ఇందూరు: విద్యార్థులు క్రమశిక్షణతో చదివితేనే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని ప్రముఖ వైద్యులు భూంరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ ఆధ్వర్యంలో నగరంలోని మాణిక్‌భవన్, గుండారం హైస్కూల్, శంకర్‌భవన్, ఆర్చిడ్, సెయింట్ జెవియర్స్ స్కూల్ విద్యార్థినులకు సైకిళ్లు అందజేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు పద్మ శ్రీనివాస్, గౌరి శంకర్, ఉపాధ్యక్షుడు వీరబ్రహ్మం, సభ్యులు గిరీశ్ కుమార్, చంద్రశేఖర్, రమేశ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.