Advertisement

అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండలం ఒంటరిపల్లి గ్రామంలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన ఉద్యోగులను శుక్రవారం గ్రామ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఒంటరిపల్లి ప్రాథమిక పాఠశాల, గట్టు మైసమ్మ తండా పాఠశాలలో పనిచేసి ట్రాన్స్ ఫర్ అయిన ఉపాధ్యాయులు బత్తుల రాములు, మురళీకృష్ణ, భాగ్యలక్ష్మి, శ్రీలత, గ్రామ కార్యదర్శి స్రవంతి, బీట్ ఆఫీసర్ శంకరప్పను సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్​ఎంలు రజనీకాంత్ గౌడ్, సుజాత ఉపాధ్యాయులు కిరణ్మయి, నరేందర్, మాజీ సర్పంచులు జెనిగ రాజయ్య, లలిత రాందాస్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సాయి రెడ్డి, స్వామి, సంతోష్, అశోక్, లక్ష్మణ్, సుధాకర్ పాల్గొన్నారు.

Advertisement