Advertisement
అక్షరటుడే, కోటగిరి: NREGS: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం 15వ విడత ఉపాధిహామీ సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలపరిధిలోని 28 జీపీల ఆడిట్ రిపోర్టులను సోషల్ ఆడిటర్లు చదివి వినిపించగా, డీఆర్‌డీవో సాయాగౌడ్ పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికారి ఆజాద్ అలీ, జిల్లా విజిలెన్స్ అధికారి నారాయణ, సోషల్ ఆడిటర్ రాజశేఖర్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంపీవో చందర్, ఏపీవోలు, పంచాయతీ సెక్రెటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
Advertisement