అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | తనను నిత్యం వేధించే బదులు ఒకేసారి ఎన్కౌంటర్ చేయాలని ఓ వ్యక్తి సోషల్ మీడియా పోస్ట్ చేసిన వీడియో కలకలం రేపుతోంది. నిజామాబాద్ నగరానికి చెందిన షేక్ రసూల్ ఈ మేరకు వీడియో పోస్ట్ చేశాడు. రసూల్ గతంలో అప్పటి మేయర్ దండు నీతూ కిరణ్ భర్త శేఖర్‌పై దాడి చేశాడు. తన భూమి కబ్జా చేయడంతో దాడి చేశానని ఆయన అప్పట్లో పేర్కొన్నాడు. అయితే ఆ కేసులో అరెస్టయిన రసూల్ రెండు నెలల క్రితం కండీషన్ బెయిల్‌పై బయటకు వచ్చాడు.
బెయిల్‌పై బయటకు వచ్చిన తనను ఐదో టౌన్ ఎస్సై వేధిస్తున్నారని రసూల్ ఆరోపించారు. ఆ ఎస్సై బీఆర్ఎస్ అభిమాని కావొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సై తనను భయపెడుతున్నారని ఆరోపించారు. వ్యక్తిగతంగా తనను వేధిస్తున్నారని పేర్కొన్నాడు. నిత్యం వేధించే బదులు తనను ఎన్కౌంటర్ చేయాలని ఎస్సైని ఆయన కోరారు. కాగా.. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు నగరంలోని నెహ్రు పార్క్ వద్దకు వస్తానని తనను కాల్చివేయాలన్నారు. చెప్పినట్లుగా రసూల్ మధ్యాహ్నం 12 గంటలకు నెహ్రూ పార్క్ చౌరస్తాకు వచ్చి, తనను కాల్చాలని ఎస్సైకి సవాల్ విసిరాడు.
వేధించే బదులు ఎన్కౌంటర్ చేయండి
గతంలో మాజీ మేయర్ భర్త శేఖర్‌పై దాడి చేసిన నిందితుడు
తనను ఐదో టౌన్ ఎస్సై వేధిస్తున్నాడి ఆరోపణ#nizamabad #nizamabadpolice #VideoViral #nizamabadcp pic.twitter.com/ycEES0yLdV— Akshara Today (@aksharatoday) March 26, 2025