Advertisement
అక్షర టుడే, ఇందూరు: Nizamabad | నగరంలోని అంతర్గత రహదారులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ రోడ్డు, బైపాస్ రోడ్డు, వర్ని రోడ్డు, ఆర్మూర్ రోడ్డు, బోధన్ రోడ్లలో ఆక్రమణలను మూడు రోజుల్లో స్వచ్ఛందంగా తొలగించాలని సూచించారు. లేదంటే తామే వాటిని తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Advertisement