అక్షర టుడే, వెబ్ డెస్క్ SRH Vs HCA : గత కొద్ది రోజులుగా (IPL Tickets) ఐపీఎల్ టికెట్లు, పాసుల వివాదం విషయంలో ఎస్ ఆర్ హెచ్, SRH, HCA, హెచ్ సీఏ HCA మధ్య డిస్కషన్ నడుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.. అయితే ఇ ఐపీఎల్ పాసుల కోసం ఎస్ఆర్ హెచ్ ను (SRH) వేధించినట్లు వచ్చిన ఆరోపణలను హెచ్ సీఏ (HCA) ఖండించింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. హెచ్‌సీఏ (HCA) పరువుకు భంగం కలిగించేలా చేయడం సబబు కాదంది. కోటాకు మించి అదనపు పాసులు హెచ్‌సీఏ ఎప్పుడూ అడగలేదని పేర్కొంది. అయితే ఇప్పుడు ఎస్ఆర్ హెచ్, హెచ్ సీఎఏ మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. హెచ్‌సీఏ కార్యదర్శి దేవ్‌రాజ్ (SRH) ఎస్ఆర్ హెచ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు చర్చల సందర్భంగా ఇరువర్గాల మధ్య పలు కీలకమైన అంశాలు తెరపైకి వచ్చాయి.
పాత ఒప్పందం ప్రకారమే స్టేడియం కెపాసిటీలో 10శాతం కాంప్లిమెంటరీ పాసుల కేటాయింపునకు ఎస్ఆర్ హెచ్ అంగీకరించింది. బీసీసీఐ, BCCI ఎస్ఆర్‌హెచ్ SRH, హెచ్‌సీఏ మధ్య ఉన్న ట్రైపార్టీ ఒప్పందం మేరకు ఇరు వర్గాలు సమ్మతం తెలిపాయి. అన్ని విభాగాల్లో అందుబాటులో ఉన్న స్టేడియం సామర్థ్యంలో 10శాతం టికెట్లు కేటాయించాలని ప్రతిపాదించింది. హెచ్ సీఏ సంవత్సరాలుగా అనుసరిస్తున్న పద్ధతినే ప్రతి కేటగిరీలో ఇప్పుడున్న పాసుల కేటాయింపును కూడా కొనసాగించనుంది. దీనికి ఎస్ఆర్హెచ్ సీఈఓ అంగీకరించారు. హెచ్ సీఏకి 3వేల 900 ఉచిత పాసుల కేటాయింపు అనేది మారదని స్పష్టం చేశారు. ఇక స్టేడియంలో ప్రేక్షకులకు మెరుగైన అనుభవాన్ని ఇచ్చేలా రెండు వర్గాలు కలిసి స్నేహపూర్వకంగా పని చేయాలని భావించారు. రెండు వర్గాలు దీనిపై సంయుక్త ప్రకటన చేయడంతో వివాదానికి పులిస్టాప్ పడింది.
అంతకముందు ఎస్ఆర్హెచ్ పలు ఆరోపణలు చేయగా, దానిని హెచ్ సీ ఏ తీవ్రంగా ఖండించింది. హెచ్‌సీఏ పరువుకు భంగం కలిగించేలా చేయడం మంచి పద్ధతి కాదంది. ఐపీఎల్ మ్యాచ్‌లను (IPL matches) విజయవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో కొన్ని సమస్యలున్నా మేము మౌనంగా ఉంటున్నాము. హెచ్‌సీఏ కార్యవర్గ సభ్యుల పట్ల ఎస్ఆర్‌హెచ్ ఉద్యోగ బృందంలోని కొందరు వ్యవహరించిన అమర్యాదపూర్వకమైన తీరు వల్లే ఈ సమస్యలు వచ్చాయంది.