ఎమ్మెల్సీ కవిత అరెస్ట్..!

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శుక్రవారం ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు జరిపిన ఈడీ అధికారుల బృందం కీలక వివరాలు రాబట్టింది. దాదాపు అయిదు గంటల విచారణ అనంతరం ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యులకు ఈడీ నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కవిత నివాసానికి చేరుకున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా ముఖ్య నేతలు కవిత ఇంటికి వచ్చారు. ప్రస్తుతం కవిత ఇంటివద్ద హైడ్రామా కొనసాగుతోంది.