కవిత భర్త అనిల్ కు ఈడీ నోటీసులు

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే సీబీఐ కోర్టు ఎమ్మెల్సీ కవితను ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. కాగా ఆ వెంటనే కవిత భర్త అనిల్ కు సైతం నోటీసు ఇచ్చింది. పీఆర్వో రాజేశ్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తిగత సహాయకులకు నోటీసులు అందజేసింది. సోమవారం విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే వారందరి సెల్ఫోన్లను దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది. వరుస నోటీసుల వ్యవహారంపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.