అక్షరటుడే, వెబ్ డెస్క్: Google Pixel 9a : ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న పలు బ్రాండ్లకు చెందిన స్మార్ట్ ఫోన్లకు, (Smart phones) గూగుల్ ఫోన్లకు (Google phones) చాలా తేడా ఉంటుంది. ఏ బ్రాండ్ వాళ్లు ఇవ్వని బెస్ట్ ఫీచర్లను (Best features) గూగుల్ (Google) అందిస్తుంది. ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీ కావడం వల్ల గూగుల్ నుంచి వచ్చే ప్రాడక్ట్ వర్త్ ఉండాలని గూగుల్ బెస్ట్ ఫీచర్లతో (Google best features) స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నది. తాజాగా గూగుల్ నుంచి పిక్సెల్ 9ఏ స్మార్ట్ ఫోన్ (Google Pixel 9a) ఇండియాలో రిలీజ్ అయింది. దీనికోసం స్మార్ట్ ఫోన్ అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్ సేల్ డేట్ను తాజాగా గూగుల్ ప్రకటించింది.
ఏప్రిల్ 16 నుంచి ఈ ఫోన్ సేల్ స్టార్ట్ (Phone sale starts) కానుంది. ఇక.. ఈ ఫోన్ ఫీచర్లు తెలిస్తే మాత్రం వావ్ అంటారు. ఈ ఫోన్ ప్రారంభ ధర మాత్రం రూ.49,999 గా ఉండగా, ఏప్రిల్ 16 నుంచి ఇండియా వ్యాప్తంగా సేల్స్ ప్రారంభం కానున్నాయి. 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో బేసిక్ మోడల్ ఫోన్ రిలీజ్ అయింది. నాలుగు కలర్స్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 9ఏ టెన్సార్ జీ4 చిప్ సెట్, 48 ఎంపీ కెమెరా, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉంటాయి.
Google Pixel 9a : సెక్యూరిటీ ఫీచర్లు ఎక్కువ
ఈ ఫోన్ లో సెక్యూరిటీ ఫీచర్లు ఎక్కువగా ఉన్నాయి. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5జీ, 4జీ బ్లూటూత్ 5.3, వైఫై 6ఈ, జీపీఎస్, నావ్ ఐసీ, యూసీబీ చార్జింగ్ పోర్ట్, యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ లాంటి భద్రతా ఫీచర్లతో పాటు, 23 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 7.5 వాట్స్ వైర్ లెస్ చార్జింగ్, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 30 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది. ప్రస్తుతానికి 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ మోడల్ ను మాత్రమే రిలీజ్ చేశారు. కొన్ని రోజుల తర్వాత ఇతర వేరియంట్లను కూడా విడుదల చేసే ఛాన్స్ ఉంది.