AISF | అక్షరటుడే, ఇందూరు: వచ్చే విద్యా సంవత్సరానికి ప్రెసిడెన్సి పాఠశాలకు అనుమతి లేకున్నా.. ఇప్పటి నుంచే అడ్మిషన్లు ప్రారంభించారని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం ఆరోపించారు. సోమవారం పాఠశాల ఎదుట వారు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ.. ప్రభుత్వ గుర్తింపు లేకున్నా ప్రవేశాలు చేపట్టి 50 శాతం ఫీజులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. ఇప్పటికే హోర్డింగ్లు పెట్టి ప్రచారాలు సైతం చేస్తున్నారని వివరించారు. సత్వరమే పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఏఐటీయూసీ నాయకుడు ఓమయ్య, ఏఐఎస్ఎఫ్ అధ్యక్షురాలు అంజలి తదితరులు పాల్గొన్నారు.