పోచారం తన కొడుకులకు సంస్కారం నేర్పించాలి

అక్షరటుడే, బాన్సువాడ: పోచారం శ్రీనివాస్ రెడ్డి ముందుగా తన కొడుకులకు సంస్కారం నేర్పించాల్సిన అవసరముందని బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. మండలంలోని సోమేశ్వర్ గ్రామంలో రవీందర్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మేలు చేసే ఉద్దేశంతో చివరి ఆయకట్టు వరకు సాగర్ కాల్వలను పూడిక తీయించే విధంగా తాను కృషి చేస్తుంటే.. పోచారం కొడుకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటీసీ నార్ల రత్నకుమార్, శేఖర్ రెడ్డి, నార్ల సురేష్, అంబర్ సింగ్, భీమ నరేందర్, పిట్ల నారాయణ, నార్ల రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement