అక్షరటుడే, ఎల్లారెడ్డి: మండలంలోని సాతేల్లి గ్రామానికి చెందిన ఎరుకల లక్ష్మి(35) శుక్రవారం విద్యుత్ షాక్ తో మృతి చెందింది. ఇంటిపై ఉన్న రేకులకు సర్వీస్ వైరు తగలడంతో విద్యుత్ సరఫరా అయ్యి కరెంట్ షాక్ తగిలింది. దీంతో ఆమె మరణించింది. ఈ విషయమై కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందజేశారు.