Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యూఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మ్యూజికల్ నైట్ ద్వారా విజయవాడకు వన్నె తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమానికి సంగీతం అందిస్తున్న తమన్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ‘ఈ ఈవెంట్ కు టికెట్ కొనమని మా వాళ్లకు చెప్పాను. విషయం తెలిసి, భువనేశ్వరి గారు ‘మీరు టికెట్ కొనక్కర్లేదు. కార్యక్రమానికి రండి’ అన్నారు. మీరంతా టికెట్స్ కొని వస్తే.. నేను మాత్రం ఊరికే రావడం తప్పుగా అనిపించింది. అందుకని, నా వంతుగా తలసేమియా బాధితుల చికిత్స కోసం త్వరలోనే ఎన్టీఆర్ ట్రస్ట్ కు రూ.50 లక్షలు విరాళం ఇస్తా.’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ‘ఎలాంటి ప్రచార హంగామా లేకుండా సేవ చేసుకుంటూ వెళ్లడం ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రత్యేకత. మరో వందేళ్ల పాటు ఇది కొనసాగాలని’ పవన్ ఆకాంక్షించారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  CM Chandrababu | ఉమెన్స్ డే రోజు భార్యకు సీఎం చంద్రబాబు స్పెషల్ గిఫ్ట్..