అక్షరటుడే, వెబ్‌డెస్క్:PCC Chief Bomma Mahesh Kumar Goud | రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలు ప్రజలకు తెలుసని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ pcc chief mahesh kumar పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మీడియా(Media)తో మాట్లాడారు.
రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు తెలంగాణ(Telangana state) కోసం ఏం సాధించారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర ప్రాజెక్టుల గురించి ఒక్కసారైనా ప్రధాని మోదీని(Prime Minister Modi) కలిసి విజ్ఞప్తి చేశారా..? అని నిలదీశారు.
పదేళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు లోపాయికారీ ఒప్పందంతో ముందుకు సాగిన విషయం అందరికీ తెలుసన్నారు. కేంద్రంలో బీజేపీ(BJP) తీసుకున్న నిర్ణయాలను బీఆర్ఎస్(BRS) సమర్థించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.