అక్షరటుడే, ఇందూరు: Hanuman jayanthi | హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శనివారం నిర్వహించే భారీ శోభాయాత్రకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా యాత్రలో ఊరేగించే విగ్రహాలను నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. ఆర్టిస్ట్ ప్రవీణ్ ఆధ్వర్యంలో హనుమాన్, శ్రీరాముడు విగ్రహాలతో పాటు భరతమాత, దత్తాత్రేయ, నంది, శివుని విగ్రహాలను రూపుదిద్దుకుంటున్నాయి.
Hanuman jayanthi | కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షణ
శోభాయాత్రకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. యాత్రను మొత్తం కమాండ్ కంట్రోల్ రూం(Control Room) నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. అడుగడుగునా పోలీసు భద్రత(Police security) ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందుగానే ప్రత్యేక బలగాలను సిద్ధంగా ఉంచనున్నారు. కంఠేశ్వర్(Kanteshwar) నుంచి నాందేవ్వాడ మీదుగా కొత్తబ్రిడ్జి, దేవిరోడ్ చౌరస్తా, గాంధీచౌక్, పెద్దబజార్ మీదుగా రాజరాజేంద్ర చౌరస్తా(Rajarajendra Chowrasta) వరకు శోభాయాత్ర సాగుతుంది. అనంతరం భారీ సభకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.