పార్టీ గేట్లు కాదు.. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తండి!

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రాష్ట్ర ప్రభుత్వ వంద రోజుల పాలనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ వంద రోజుల పాలనలో రాష్ట్రంలో 174 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. 38 మంది ఆటోడ్రైవర్లు బలయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎండిపోయిన పంటలకు ప్రతి ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఒకవైపు పంటలు ఎండిపోతుంటే ప్రాజెక్టుల గేట్లను ఎత్తకుండా.. కాంగ్రెస్ మాత్రం పార్టీ గేట్లను ఎత్తిందని ఎద్దేవా చేశారు. ఈ మూడు నెలల కాంగ్రెస్‌ పాలన చూసి ప్రజలు పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెబుతారన్నారు. ఆరు గ్యారంటీలతో అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న వేళ హరీశ్‌రావు ఈ వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీసింది.