కాంగ్రెస్ గూటికి రాజేశ్వర్ రావు

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు కాంగ్రెస్ గూటికి వెళ్లనున్నారు. శనివారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది. వైఎస్ ప్రభుత్వ హయాంలో మొదటిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికైన రాజేశ్వర్ రావు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరగా తిరిగి ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. ఆ తర్వాత క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కెసీఆర్ ప్రభుత్వం కట్టబెట్టింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగా కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను రద్దు చేసింది.