అక్షరటుడే, కామారెడ్డి : Medical College | కామారెడ్డి (Kamareddy) మెడికల్ కళాశాల(Medical College)లో ఔట్ సోర్సింగ్ నియామకాల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. అభ్యర్థులు, మ్యాన్‌పవర్ ఏజెన్సీ నిర్వాహకులు, ఉపాధి కల్పనా అధికార సిబ్బంది, కళాశాల ప్రిన్సిపాల్‌ల యూపీఐ(UPI) లావాదేవీలు పరిశీలిస్తే అక్రమాలు బహిర్గతమవుతాయన్నారు.
అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇప్పటికైనా అక్రమ నియామకాలను వెంటనే రద్దు చేసి అర్హులకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో బీవీఎం రాష్ట్ర కార్యదర్శి జీవీఏ విఠల్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సురేష్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, జీవీఎస్ జిల్లా అధ్యక్షుడు వినోద్ కుమార్, అభ్యర్థులు రవి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.