అక్షరటుడే, కామారెడ్డి: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా బీబీపేట మండలం మాందాపూర్‌లో ఎక్సైజ్‌ సీఐ మధుసూదన్‌ రావు, మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు నాగరాజ్‌ గౌడ్‌ ఈత మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మాందాపూర్‌, ఇస్సానగర్‌ గ్రామాల్లో 600 ఈత చెట్లు నాటినట్లు తెలిపారు. గీత వృత్తిని మరింత అభివృద్ధి చేసేందుకే గ్రామగ్రామాన ఈత మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టామన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు నారాగౌడ్‌, కిష్టా గౌడ్‌, వెంకట్‌ స్వామి గౌడ్‌, నర్సాగౌడ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, వెంకట్‌ గౌడ్‌, దయానంద్‌ గౌడ్‌, సాయి కుమార్‌ గౌడ్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement