అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలోని నవనాథ సిద్దుల గుట్ట శివాలయాన్ని సోమవారం ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. సిద్దుల గుట్ట అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు చేశారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.