అక్షరటుడే, ఆర్మూర్ : ఆర్మూర్ ఎక్సైజ్ కార్యాలయ నూతన భవన ప్రారంభోత్సవం ఈనెల 30న నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ స్టీవెన్సన్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రానున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, ఎంపీ అర్వింద్ హాజరుకానున్నట్లు సీఐ పేర్కొన్నారు.